Monday, March 5, 2012

మీ వల్ల నా లైఫ్ నిలబడింది.

''లోకనాథ్ గారు చాల థాంక్స్ సర్... మీ వల్ల నా లైఫ్ నిలబడింది. 70 వేలరూపాయలతో  తోపాటు నా డిగ్రీ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేశారు. ఇక మానాన్న కూడా నన్ను తిట్టడు..మీ మేలు మరువలేను  రేపు మార్నింగ్ మీ ఆఫీసు కి వచ్చి కలుస్తాను"  అంది ఈ  రోజు ఈవినింగ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి..."ఒకే మ్మా... అలాగే రా ".. అని ఫోన్ కట్ చేశాను.ఆ అమ్మాయ్ వాయిస్ లో ఉన్న సంతోషాన్ని మాటల్లో చెప్పడం నాకైతే కాని పని... చాల చాల ఉత్సాహంగా ఉంది  ...భవిష్యత్ మీద భరోసా కనిపించింది... నాకావాయిస్ లో. నాకు చాల గర్వంగా అని పించింది కూడా..అసలు అవుతుందా? కాదా? అని నాలో నేనే మదను పడుతున్న...ఈ మే పని గురించే..

.ఇంతకి విషయం ఏంటంటే... గుంటూరు జిల్లా తణుకు పక్కన ఒక చిన్న పల్లెటురుకి చెందిన దళిత అమ్మాయి..హైదరాబాద్ లో BUSINESS SCHOOL లో  జాయిన్ అవ్వాలని వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ కి కార్ ని పంపి మరి జాయిన్ చేస్కున్న  మేనేజ్మెంట్  ఫీజ్ లేట్ అయిందని ... రాత్రి అనికూడా చూడకుండా..మెడపట్టి బైటకు గెంటివేసి "నీకు దిక్కున దగ్గరకి పోయి చెప్పుకో.. బాలెన్సు ఫీజ్ తెస్తేనే రా లేకుంటే..వెళ్ళిపో"  అని నిర్దయగా పంపేస్తే .. చేతిలో చిల్లి గవ్వకుడా లేకుండా..ఆ రాత్రి పూట హాస్టల్ బైట పడ్డది..ఎక్కడికని వెళ్లగలుగుతుంది..ఆ చీకట్లో..  అప్పుడు సకల జనుల సమ్మె కుడా జరుగుతుంది పాపం  ... ఎక్కడికైనా వెళ్దామంటే కనీసం ఆ ఏరియాలో మాములుగానే ఏ వాహనాలు రావు ఇక సకల జనుల సమ్మె జరుగుతుంది అంటే చూడండి పరస్థితి ఎంత నరకమో.?? నిన్న తను ఏడుస్తూ చెబుతుంది.." రైల్వే స్టేషన్ లో పడుకున్నా సర్" ...అని ఒక్కసారిగా బిక్కరగా ఏడ్చేసింది.. ఓదార్చడం మా వాళ్ళ కాల. ..  ఏ అల్లరిమూక ఉన్మాద మూక కంట్లో పడుంటే..అనే ఆలోచన రాగానే నా గుండె నీరై పోయింది..అయ్యే ఒక అమ్మాయికి ఎంత కష్టమొచ్చిందో కదా..అని వింటున్న మేము కన్నీళ్లను ఆపుకోలేకపోయాం.    ఆ కాలేజ్  మానేజ్ మెంట్ మీదే కాదు..సకల జనుల సమ్మె మీద ఒక్కసారిగా కోపం, ఆవేశం తన్నుకొచ్చాయి.....  సరేలేమ్మా ... ఏడవకు..మేమున్నాం కదా......ఏడవకు మేమున్నాం  ఇక వదిలేయ్ ... అన్నా వోదార్పుగా .. వాళ్ళ నాన్న కూడా ఏడుపు ఆపుకోలేకున్నాడు... కాసేపటికి     కాస్త శాంతించి .. అసలు విషయం చెప్పడం ప్రారంబించింది...

" సర్  RATAN GLOBAL BUSINESS SCHOOL వాళ్ళు మా గుంటూరు లో PGDM కోర్స్ కి ఎంట్రన్స్ పెడితే వెళ్లి వ్రాశాను  .. ర్యాంక్ వచ్చింది..2years కి 5లక్షలు అవుతుందంటే...అంత నా వాళ్ళ కాదు సర్  .. నేను ఇక్కడే C.A జాయిన్ అవుతాను అంటే... "భలేవారే మీరు అసలు ఏం కట్టక్కరలేదు..మొత్తం ICICI bank వాళ్ళే లోన్ ఇస్తారు...మేమే ప్లేస్ మెంట్ కూడా చూపిస్తాం .. తర్వాత బ్యాంకు వాళ్ళే లోన్ అమోంట్ కట్ చేస్కుంటారు .. సో మీకు నో ప్రాబ్లం... అన్నారండి..ఇప్పుడు మొదటివిడతగా 50,వేలు కట్టమాన్నరండి.. నెక్స్ట్ 70,వేలు తర్వాత 10,వేలు ఇంకో 20,వేలు మొత్తం 1.30 లక్షలు..కట్టాలని టార్చర్ పెట్టారు సార్ అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ..నాకు "మనం ఎలాగైనా ఈ విషయంలో ఫైట్ చేయాలనిపించింది.."   కూలిచేస్కునే కుటుంబం నుండి అంత మొత్తాన్ని గుంజిన కాలేజ్ యాజమాన్యం..       ఇంతకి అక్కడ నడుపుతున్నది అంతా బోగస్ కాలేజ్ అని తేలింది.. క్లాసు లు అసలు జరగవు .. స్టూడెంట్స్ ఉన్నది forty members మెంబర్స్ మాత్రమే.. స్టాఫ్  founder president Dr.B RATAN REDDY అతని వైఫ్, వాచ్ మెన్, మెస్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఉండరు..ఇంతా చేసి ఆ యాజమాన్యం ఇచ్చే సర్టిఫికేట్ నాలుక గిసుకోను కూడా పనికి రాదనీ అంతకుముందు అక్కడ చదివిన  సీనియర్స్ చెప్తే ... అవాక్కవ్వడం  మావంతైంది...

                           సరే...ఇంతకి..మా సంస్థ నుండి ఆజాద్,రాజేష్ , సుధాకర్, ఇమ్మయ్య, ఎస్ ఎస్ రావు లను పంపి నేను ఆఫీసు నుండే విషయం వాకబు చేస్తూ ..అర్ధ గంటకోకమారు కాల్స్ మాట్లాడుతూ టచ్ లో ఉంటున్నాను..ఒక వేళ అక్కడ ఏమైనా గొడవ పెద్దదిగా జరిగితే బైటుంది మానేజ్ చేయాలనీ నేను ఈ ఆపరేషన్ లో ప్రత్యక్షంగా ఇన్న్వాల్  కాలేదు..మా వాళ్ళు వెళ్లి అడిగితె...మొదట కాస్త బెట్టు చూపించినా..మావాళ్ళ కమిట్ మెంట్ కి జడిసి..70 వేలకి చెక్కు..సర్టిఫికెట్స్ ఇవ్వక తప్పింది కాదు...ఆ బోగస్ కాలేజికి ...ఇందులో కొసమెరుపు ఏంటంటే...వెళ్ళిన   వాళ్ళలో ఒకతన్ని పిలిచి నీకు 10  వెలుఇస్తాము..కాస్త సర్దుకుపొండి..అని RATAN GLOBAL BUSINESS SCHOOL వాళ్ళు.మా వాళ్లతో  బిజినెస్ మాట్లాడాడంట, చుసారటండి వాడి బుద్ది ఇక్కడకూడా వాడు బిజినెస్ వదలటం లేదు..


ఈ పోస్ట్ రాద్దామని డిసైడ్ అయ్యాక ఆ అమ్మాయి కి ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం ఇంతకి ఆ జఫ్ఫా గాడిచ్చిన చెక్ పాస్ ఐందా లేదా అని...  ఆ అమ్మాయి అంది కదా.." హా పాస్ అయిందండీ..మీకు ఇమ్మని 5000  ఇచ్చానే .. ఎస్ ఎస్ రావు కి ఇవ్వలేదా?? " అంది..స్టైలుగా  ఆ..  హా..!! తల్లి .. మేం నికేలా కనిపిస్తున్నాం తల్లి..డబ్బులు తీస్కుని  దాదా గిరి చేసేవాళ్ళలా కనిపిస్తున్నామా తల్లి...నమస్కారం మ్మా..తల్లి..నువ్ భలేగుండావ్ గదా తల్లా..అని నా మనసులోనే నేను అనుకున్నా.." పైకి .."అరె అలా ఎందుకు చేశావమ్మ ..మాకు డబ్బులెందుకమ్మా.. నీ సమస్య నుండి ..నువ్ బైట పడి నీ సర్టిఫికెట్స్ నీకు చేరాలనే మా కోరిక తపన అంతేకాని డబ్బులు కోసం కాదు ..ఎనీవే నీకు ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇంకా మీ డాడీ పొలం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు చేతికందాయ్ సో..నువ్ హ్యాపీ మేము డబుల్ హ్యాపీ..బాయ్..తల్లి..అని పెట్టేశా.. ఇదన్నమాట విషయం.





15 comments:

PALERU said...

Nice post annayyaa...

జైభారత్ said...

రాయగలనో లేదోఅని జెస్ట్ చెక్ చేస్కుందామని రాశా...నచ్చినందుకు థాంక్స్ బ్రదర్..

శశి కళ said...

chaalaa chakkaga vrasaru

శశి కళ said...

meeru settings loki velli comment moderation ane option pettukondi.appudu meeru choosi publish chestene publish avutaayi.coment verification teeseyyandi

శశి కళ said...

meeru na blog loki vachchi mee mail id ivvandi

జైభారత్ said...

చాల థాంక్స్ శశిగారు...అలాగే ఇస్తాను..మనసులో చాల ఆలోచనలు..బ్లాగ్ లో పెట్టాలనే..ముందు ప్రయత్నమే ఇది..ఇలాగె కొనసాగిస్తాను.

శివరంజని said...

చాలా బాగా రాశారు ... మీరు చేసిన మంచి పనికి హేట్సప్ :))

జైభారత్ said...

హమ్మ... యెర్ర బస్సుగోరేనా.. నా బ్లాగ్ కి వచ్చారా?... (((((((((((డాం..))))))))))) ఉహించని ఈ పరిణామానికి మూర్చిల్లితిని నా మొహం మీద కాసిన్ని గోదావరి జలాన్ని చిలకరించండి.. :)
చాల చాల థాంక్స్ ..శివరంజని గారు.

ప్రవీణ said...

Good work Loknath garu..చక్కగా రాసారు. Keep writing.

జైభారత్ said...

ప్రవీణ గారు.. చాల సంతోషం అండీ....నమస్తే.

Raaz said...

nice machha......

సీత said...

wow....very very nice writing...

శివరంజని said...

రాయగలనో లేదోఅని జెస్ట్ చెక్ చేస్కుందామని రాశా>>>>>>>>>> అదేంటి లోకనాద్ గారు ఎందుకు రాయలేరు...... చక్కగా రాసారు ... ఫస్ట్ లో నేను కూడా ఇలానే అనుకున్నాను

ఇకపోతే హహహ మీ బ్లాగ్ కి నేను రావడం పెద్ద విశేష మేముందండి... ఒక మంచి పని చేసారు... బాగా రాసారు నేను కామెంట్ పెట్టాను అంతే..... కాకపోతే ఎర్రబస్ కదా అండి అందుకే లేట్ గా వస్తుంది :)))))

ఈ మద్యన నా బ్లాగ్ కి నేనే అతిధి ని అయిపోయాను కాస్త బిజీ ఉండడం వల్ల లేకపోతె ఇలా మీ అందరి బ్లాగ్ లలో సందడి చేస్తూనే ఉండేదాన్ని ఎప్పుడూ
thank you so much :)))))))

Unknown said...

మీరు విజయవిహారంలో పనిచేస్తుంటారా

Unknown said...

మీరు విజయవిహారంలో పనిచేస్తుంటారా