Saturday, June 19, 2010

బ్రాహ్మణుల చెరనుంచి దేవుడిని విడిపించారు!


అర విప్పురం గ్రామం నారాయణ గురు సాదించిన మొదటి అద్బుతానికి వేదిక అయ్యింది . నారాయణ గురు జన్మించింది -1856 లో తిరువనంత పురం సమీపంలోని చెంపలం గ్రామంలో . ఐతే ...లౌకిక వ్యవహారాలు వీడి, నారాయణ గురు అరువిప్పురం వద్ద తపస్సు చేసుకునే రోజుల్లో ప్రజలు... భక్తి పురస్సరంగా ఆయనను "నాను స్యామి అని పిలుచు కునే వారు. నాను స్వామి ప్రక్యతి పెరిగి పోయే భక్తులు తండోపతండాలుగా రావడం ప్రారంభమైంది. అరువిప్పురం విశేష యాత్ర స్థలి గాను, నాను స్వామి సశారిర దైవంగాను మారి పోయే పరస్థితి వచ్చింది. అద్వైత యోగి నారాయణ గురు కి తనని భక్తులు దైవంగా పూజించడం ఇష్టం ఉండేది కాదు. అందుకే ప్రజలు పూజించు కునేందుకు శివరాత్రి నాడు తాను శివలింగాన్ని ప్రతిస్తిస్తానని నారాయణ గురు ప్రకటించాడు. ప్రజలందరూ పూజించు కునేందుకు ఆలయమా ? ఆకాలములో కేరళలో అది అద్భుతం కంటే, ఎక్కువ. కేరళలో కేవలం బ్రాహ్మణులకే ఆలయ ప్రవేశ అర్హత ఉండేది. క్షత్రియులు గర్భ గుడికి రెండు అడుగుల దూరం లో నిలబడవచ్చు. నాయర్ లు 16 అడుగుల దూరంలో వరకు రావొచ్చు ఎజవాలు 32 అడుగుల దూరం లో ఉండాలి. పులయ,పరయ కులాల వాళ్ళు కనేసం 64 అడుగుల దూరం పాటించాలి. ఇక నాయాది లైతే బ్రాహ్మణులకు కను చూపు మేరలో కానీ పించ కూడదు .
(ఆలయ ప్రవేశం విషయం లో మాత్రమె కాదు, నిత్య జీవితం లో సైతం కేరళలో అవర్నుల పైన అమానుష మైన అంక్షలు అమలులో ఉండేవి. చైనేత మగ్గాల మీద, పడవల మీద, వలల మీద కళ్ళు గీత కార్మికుడు ఎక్కే చేతల్ల పైన పన్నులుండేవి అవర్నుడు తలమీద జుట్టు పెంచు కున్నందుకు పన్ను కట్టాల్సి వచ్చేది. ఆవరణ స్త్రీల రొమ్ముల సైజును బట్టి' ములకరంఅనే పన్నును కట్టాల్సి వచ్చేదంటే కులువ్యవస్థ ఎంత ఏహ్యమైన జుగుప్స కరమైన రొచ్చుగ తయారయిందో అర్ధం చేస్కోవచ్చు కింది కులాల స్త్రీలు పురుషులు తమ చాతి మీద ఎలాంటి ఆచ్చాదన లేకుండా (అర్ధ నగ్నంగ) ఉండాలని ఆంక్ష విదించారు ఒకవేళ ఎవరైనా వస్త్రాన్ని కప్పు కున్న సవర్నుడు ఎదురైనప్పుడు గౌరవ పూర్వకంగా వస్త్రాన్ని తొలగించి పారివేయాలి. తర తరాలుగా సాగిన ఈ అంక్షల వల్లనే కేరళలో కొందరు స్త్రీలలో పైట వేసుకోక పోవడం ఇప్పటికి ఒక ఆచారం గా కానీ పిస్తుంది. ఈ నిషేదాన్ని ఉల్లంగించి, వక్షాన్ని కప్పుకున్న స్త్రీ రాణి గారికి ఎదురైనప్పుడు, రొమ్ములు నరకిన క్రూర సంగటన కూడా ఒకానొక కాలంలో జరిగిందని చెబుతారు.) మరి ప్రజలందరూ ఒకే ఆలయంలో దైవాన్ని పుజిచుకోవడం ఎలా సాద్యం? ఐన అనువిన ఆలయం నిర్మాణం అవకుండా, వనరులు సమకురకుండా, ఇంత స్వల్ప వ్యవది లో లింగ ప్రతిష్టాపన ఎలా సాద్యం? నారాయణ గురు అవేవి అవసరం లేదన్నారు.
శివరాత్రి రోజు అర్ధ రాత్రి నారాయణ గురు నది గర్భములో ప్రవేశించారు కొద్ది సమయం తర్వాత చేతిలో ఒక నల్లని గుండు తో నది నుంచి బైటకు వచ్చారు ఆగుండును సమతలంగా ఉన్న రాతి మీద ప్రతిష్టించారు. స్వహస్తాలతో అబిషేకించారు.
ఈఅపురుప దృశ్యాని వీక్షించెన ప్రజల మనసుల్ని...అవ్యక్త భావావేశ మేదో ముంచేసింది. ప్రజల సంతోషానికి అవధులు లేదు.
ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ'' శివనామ జపంతో ఆప్రదేసం మారు మ్రోగింది. భక్తీ ఉప్పొంగింది. ప్రజాలందరి ఆశలకు, ఆర్తికి... కనిపించని దైవం, కనిపించే నారాయణ గురు కేంద్ర బిందు వయ్యారు.
1888 సం ఫిబ్రవరి పదవ తారీకు తొలి ఘడియల్లో భవిష్యత్ కేరళ రూపురేఖలని మార్చ గల ఒక నిశ్యబ్ధ మహా విస్పోటం ఆవిధంగా సంభవించింది. బ్రాహ్మణుల చేరలోంచి ఈశ్వరుడు విడి వడ్డాడు. ప్రజల ఆర్తిని, వేదనను వినేందుకు దైవం అణగారిన, నిమ్న కులాల చెంతకు నడచి వచ్చాడు. ఎగుడిలో తాము ప్రవేశించలేరో..ఎ దైవాన్ని దర్శించేందుకు తాము నిర్ణీత దూరాలను పాటిస్తూ అవమానాలను, ఈసడింపులను ఎదుర్కోవాలో... ఆదైవం తమ కళ్ళముందే వెలసింది.
బ్రాహ్మనాదిపత్యనికి చరిత్ర లో కని విని ఎరుగని ఒక చావు దెబ్బ తగిలింది.
అరవిప్పురం ఆలయ వార్త దావానంలా వ్యాపించింది. ఆలయ ప్రవేశార్హత లేని ఎజవ కులస్థుడు శివ లింగాన్ని ప్రతిష్టించాడమ? చాన్దస్సులకు మిన్ను విరిగి మీద పడినట్టైంది.
నారాయణ గురు కి అప్పటికే ఏర్పడిన అద్వితీయ ప్రతిష్ట కారణం గా ప్రత్యక్ష ఘర్షణకి బ్రాహ్మణులువెనకడుగు వేస్తున్నారు. అప్పటికి ఒక బ్రాహ్మణ అహంకారి వచ్చి ఒక ఎజవ కులస్తుడికి ఆలయాన్ని ప్రతిష్టించే అధికారం ఎవరు ఇచ్చారు? అని ఆగ్రాహంతో ఊగి పోతు ప్రశ్నించారు. నారాయణ గురు మందస్మిత వదనంతో జవాబు ఇచ్చారు. '..నిజమే. కాని..., నేను ప్రతిష్టించింది బ్రాహ్మణ శివుడిని కాదు, ఎజవ శివుడిని..' అరవిప్పుర ఆలయం త్వరలోనే ప్రసిద్ద మైంది. ఆలయ ప్రవేశద్వారం వద్ద నారాయణ గురు ఇలా రాయించారు:
కుల భేదాలకి, మత ద్వేషాలకి తావు లేకుండా మనుషులంతా అన్నదమ్ముల్లా కలసి ఉండే ఆదర్శ మందిరం ఇది.
బీసీ ల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్ళు ? పుస్తకం నుండి పేజి నేఁ:74

1 comment:

Mahi said...
This comment has been removed by a blog administrator.