Friday, November 18, 2011

రావా ఒక ఉప్పెనలా!

ఎలా ఉన్నావ్?
నీరు లేని సముద్రంలా..
జాబిల్లి లేని ఆకాశంలా..
ప్రతిమ లేని గుడిలా..
నువ్వు లేని నేనులా..ఉన్నావా..???

నీటి చుక్కకు అంగలార్చే
చివురు టాకుల ఉన్నాను
గొంతెండిన ఎడారి
బాటసారిలా ఉన్నాను...
పుష్పించని మొక్కలా ఉన్నాను.
కోయిల గొంతులో మార్ధవ్యాన్ని
గ్రోలలేని అచేతన లో ఉన్నాను..
రావా ఒక ఉప్పెనలా
కుచించుకు పోతున్న
ఈ ప్రపంచం నుండి
నీ లోకంలోకి తిసుకేల్లవు..??

4 comments:

రసజ్ఞ said...

కోయిల గొంతులో మార్ధవ్యాన్ని
గ్రోలలేని అచేతన లో ఉన్నాను..
బాగుంది మీ భావన!

జ్యోతిర్మయి said...

"జాబిల్లి లేని ఆకాశంలా..
ప్రతిమ లేని గుడిలా.."
ఉపమానం బావుంది!

జైభారత్ said...

రసజ్ఞ గారు నా పైన పన్నిటి వానకురిసిన్నట్టే ఉంది..మీ కామెంట్ చూశాక నేను అందుకున్న మొదటి బ్లాగ్ కామెంట్ మీదే మీకు నిజంగా నా ధన్యవాదాలు..మరియు కృతఙ్ఞతలు...మీనుండి ఇంకా సలహాలు సూచనలు కోరుకుంటున్నాను.థాంక్స్

జైభారత్ said...

జ్యోతిర్మయి:గారు మీ స్పందనని తెలియచేసినందుకు చాలా చాలా ఇంకా మీకు నచ్చినందుకు బోల్డంత ధన్యవాదాలు ... మీ సూచనలు అలాగే సలహాలు తప్పకుండ తెలజేయాలని కోరుకుంటున్న..